సభ్యత్వ నమోదును వేగవంతం చేయండి: సమ్మిరెడ్డి
గ్రామాల్లో బీజేపీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని జిల్లా అధికార ప్రతినిధి అలివేలి సమ్మిరెడ్డి సూచించారు. సభ్యత్వ నమోదు మండల స్థాయి కార్యక్రమాన్ని గురువారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైన సమ్మిరెడ్డి మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ప్రతీ గ్రామం నుండి ఎంతో మంది బీజేపీని ఆదరించారని, వారందరికీ సభ్యత్వం ఇచ్చేలా ప్రయత్నం చేయాలని కోరారు.