నిరుద్యోగ సమస్యలపై వినతి పత్రం అందించిన బిజెవైయం నాయకులు..

82చూసినవారు
నిరుద్యోగ సమస్యలపై వినతి పత్రం అందించిన బిజెవైయం నాయకులు..
నిరుద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం భారతీయ జనతా యువమోర్చ అధ్యక్షులు గడ్డం అరుణ్ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కనుకయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ నీళ్ళు, నిధులు, నియామకాలపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు నుండి నేటి వరకు నిరుద్యోగులను మోసం చేస్తునే ఉన్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్