తిమ్మాపూర్: ధాన్యం కేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి
తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో మోసాలకు తావుండకూడదన్నారు.