వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి హెలిక్యాప్టర్లో చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ పార్కింగ్ స్థలంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇప్పటికే బహిరంగ సభ కిక్కిరిసిపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు, నేతలు వస్తున్నారు.