3వ వార్డ్ లో చలి బోనాలు

1761చూసినవారు
3వ వార్డ్ లో  చలి బోనాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో ఆదివారం 3వ వార్డ్ సభ్యులు చలి బోనాలు తీశారు. పూర్ణిమ తరువాత శివరాత్రికి 10 రోజుల ముందు.. ఒక రోజు బోనం వండి తదుపరి రోజు గ్రామ దేవత అయినటువంటి పోచమ్మ తల్లికి బోనాన్ని సమర్పిస్తారు. ఈ సంప్రదాయం అనాదిగా వస్తుంది. ఏటా ఈ సంప్రదాయాన్ని గ్రామ ప్రజలు ఉత్సాహంగా నిర్వహిస్తారు. చలి బోనాలు పెట్టిన తరువాత 3 రోజులకు ఇంటి దేవత అయినటువంటి ఎల్లమ్మ తల్లికి నైవేద్యం పెడతారు. గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం ఈ చలిబోనాలను ఘనంగా నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్