వేములవాడ: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రోబోటిక్స్ శిక్షణ
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల్లో బుధవారం సోహం అకాడమీ ఆధ్వర్యంలో రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా 8, 9వ తరగతికి చెందిన విద్యార్థుల్లో సృజనాత్మక పెంపొందించి సాంకేతికతపై అవగాహన కల్పించేలా రోబోటిక్స్ ప్రాథమిక సూత్రాలపై శిక్షణ అందించారు. విద్యార్థులను సాంకేతిక ఆవిష్కరణల వైపు నడిపించడమే ప్రధాన లక్ష్యంతో సోహం అకాడమీ కృషి చేస్తుందన్నారు.