డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

60చూసినవారు
డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 లక్షల 75 వేల 64 మంది ఓటర్ల వివరాలతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రజల వివరాలతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేశామని, వేములవాడ నియోజకవర్గంలో మొత్తం 2, 27, 575 మంది ఓటర్లు, సిరిసిల్ల నియోజకవర్గంలో 2, 47, 489 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్