కథలాపూర్ మండలంలోని బొమ్మెన గ్రామ శివారులో నక్కలు అటువైపు మేతకు వచ్చి బావిలో పడ్డాయి, ఆ నక్కలు శుక్రవారం సాయంత్రం బావిలో పడగా రైతు చూసి ఫారెస్ట్ ఆఫీసర్లకు తెలియజేశారు. దీనితో ఫారెస్ట్ ఆఫీసర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ముషీరుద్దీన్ సిద్ధికి, రేంజ్ ఆఫీసర్ మధుసూదన్ శుక్రవారం సాయంత్రం నుండి శనివారం మధ్యాహ్నం వరకు కష్టపడి ఆ నక్కలను బయటకు తీసి వదిలిపెట్టారు. దీంతో సుఖాంతంగా నక్కలు బయటపడ్డాయి.