రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అనంతపల్లి గ్రామ ప్రజలు హరితహారం నిర్వహించారు. ఈ హరితహారంలో మొక్కలను రోడ్డుకి ఇరువైపులా ప్రైమరీ స్కూల్ ఆవరణలో నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐతం దేవేంద్ర వెంకటేశం, గ్రామ సెక్రటరీ ప్రసాద్, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ రాజిరెడ్డి, ఆశా వర్కర్స్ యశోద, సపాయి కార్మికుడు, నాంపల్లి గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.