రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఒగ్గు కళాకారులు శ్రీ గాజర్ల బుగ్గన్న కళాబృందం ఆధ్వర్యంలో కరోనా నివారణ చర్యలను ఒగ్గు కథ రూపంలో మంచి విశ్లేషణతో, నివారణ చర్యలను ఒగ్గు కథ రూపంలో వివరించారు. ఇంత క్లిష్ట పరిస్థితులలో ఒగ్గు కథ రూపంలో తమకున్న కళతో నివారణ చర్యలను ప్రజలకు విశ్లేషించినందుకు వారిని పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గాజర్ల బుగయ్య, గాజర్ల ప్రశాంత్, ఒగ్గు కథ కళాబృందం సభ్యులు పాల్గొన్నారు.