ఉదారత చాటుకున్న యువకులు

1561చూసినవారు
ఉదారత చాటుకున్న యువకులు
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో కరోనా విజృంభణ కారణంగా..లాక్ డౌన్ నేపథ్యంలో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి నిరాశ్రయులకు ముడపల్లి గ్రామ యువకులు అన్నదానం చేసారు. సుమారు 70 కుటుంబాలకు అన్నదానంతో పాటు ప్రతి ఇంటికి 3 కిలోల చొప్పున బియ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రతి గ్రామంలోని యువకులు తమ గ్రామంలో ఉన్నటువంటి ఇలాంటి పేదవారికి తమకు తోచిన సహాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, శరత్, అనిల్, మధు, హమీద్, సుమన్, వేణు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్