తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన కస్తూరి

69చూసినవారు
తాను తెలుగు వారిని అవమానించలేదని నటి కస్తూరి స్పష్టం చేశారు. తమిళనాడులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తెలుగు వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరలైన విషయం తెలిసిందే. ఆ కామెంట్స్‌పై క్లారిటీ ఇస్తూ ఆమె పోస్ట్‌లు పెట్టారు. ‘తెలుగు నా మెట్టినిల్లు. తెలుగు వారంతా నా కుటుంబం. డీఎంకే పార్టీ నా కామెంట్స్‌ను వక్రీకరిస్తోంది. ఇలా నాపై నెగెటివిటీ తీసుకొచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తోంది’ అని కస్తూరి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్