ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలీసులకు పలు సూచనలు చేశారు. నేరాల విషయంలో పోలీసులు గత ప్రభుత్వంలో మాదిరి అలసత్వం పదర్శించకూడదని హెచ్చరించారు. 'పదవి ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. దానిని నేను పట్టించుకోను. నిందితుల కోసం ఎవరైనా తమ బంధువు అని వస్తే మడత పెట్టి కొట్టండి' అంటూ పోలీసులకు సూచించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ముఖ్యమని ఆయన హితవు పలికారు.