లోకల్ యాప్ ఈవినింగ్ న్యూస్ @7 PM

11603చూసినవారు
లోకల్ యాప్ ఈవినింగ్ న్యూస్ @7 PM
*ఎల్‌.రమణకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్‌. మంచి రాజకీయ భవిష్యత్ కల్పిస్తామని భరోసా. 2,3 నెలల్లో చేనేతకు బీమా సౌకర్యం: కేసీఆర్

*ఎస్టీ విద్యార్దుల ఉన్నత విద్యకు రూ.20 లక్షల సాయం. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ ఆధ్వర్యంలో విద్యానిధి పథకం కింద ప్రముఖ యూనివర్శిటీల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చేయాలనుకునే ఎస్టీ విద్యార్దులకు ఆర్దిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం

*కోకాపేట భూముల వేలంలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపణ. రేపు అన్ని వివరాలు బయటపెడతానని ప్రకటన

*తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన ఆరోపణలు. త్వరలో ఇద్దరు సీఎంల బండారం బయట పెడతాన్న బండి సంజయ్

*కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, నిర్వహణ మార్గదర్శకాల గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చే ముందు ఎంతో చర్చించామని కేంద్రం వెల్లడి. అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం

*ఏపీలో కొత్తగా 2,345 కొవిడ్‌ కేసులు. 16 మంది మృతి

*గ్రూప్ 1 మినహాయించి మిగిలిన అన్ని నోటిఫికేషన్లకు ప్రిలిమ్స్ రద్దు చేసిన ఏపీపీఎస్సీ. ఇకపై వచ్చే నోటిఫికేషన్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటన

*ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం జగన్. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి

*నిరుద్యోగ సమస్యలపై మరింత దూకుడుగా జనసేన. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా పోరాటం చేస్తామన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

*ఈ నెల 19న సీఎం ఇంటిని ముట్టడిస్తామన్న నారా లోకేష్‌. ప్రభుత్వ వెంటనే 2.30 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్