నాగచైతన్య ఫొటో షేర్ చేసిన సమంత

214073చూసినవారు
నాగచైతన్య ఫొటో షేర్ చేసిన సమంత
టాలీవుడ్‌లో క్యూట్ కపుల్‌గా నాగచైతన్య-సమంత జంట పేరు తెచ్చుకుంది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి చక్కటి ఆదరణ లభించింది. ఎంతో అనోన్యంగా జీవిస్తున్నారనుకుంటే ఆరు నెలల క్రితం విడాకులు తీసుకుంటున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. దీంతో వారి అభిమానులు అవాక్కయ్యారు. అప్పటి నుంచి ఎవరికి వారే విడిపోయి జీవిస్తున్నారు. విడాకుల ప్రకటన తర్వాత చైతో ఉన్న ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి సామ్ తొలగించింది. అయితే మంగళవారం చైతో ఉన్న ఓ ఫొటోను షేర్ చేసింది. వారిద్దరూ కలిసి నటించిన మజిలీ చిత్రానికి మూడేళ్లు కావడంతో ఆ పోస్టర్‌ను తన ఇన్‌స్టా స్టోరీగా ఉంచింది. దీంతో కొద్ది సేపటికే ఆ ఫొటో వైరల్ అయింది.

సంబంధిత పోస్ట్