బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే నైతిక హక్కు MLC కవితకు లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 'బీసీ ఉద్యమాలకు కవిత సహయం అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గించింది వాళ్ళ నాన్న కేసీఆర్. బీసీ ఉద్యమాలు ఎలా నడపాలో బీసీలకు తెలుసు. కవితకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే BRS అధ్యక్షునిగా బీసీలకు అవకాశం ఇవ్వాలి. BRS అధికారంలోకి వస్తే బీసీని CMగా చేస్తామని ప్రకటించాలి' అని డిమాండ్ చేశారు.