తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా..
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదరడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. "ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండాలి కదా. ఇలా ఎలా మాట్లాడతారు?, సర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా?, ఆ వ్యాఖ్యలు ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తాయి" అంటూ ధర్మాసనం పేర్కొంది.