కేసీఆర్ ప్రభుత్వం.. బీసీలు, బలహీనవర్గాల ప్రభుత్వమని BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ లో జరిగిన బీసీ కమిషన్ మీటింగ్ అనంతరం అయన మీడియాతో మాట్లాడారు. '1994-2004 వరకు అప్పటి TDP ప్రభుత్వం బీసీలకు ₹2000 కోట్లు ఖర్చు పెట్టింది. 2004-2014 వరకు
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ₹16,000 కోట్లు ఖర్చు పెట్టింది. 2014-2023 వరకు BRS ప్రభుత్వంలో
కేసీఆర్ ₹45,000 కోట్లు ఖర్చు పెట్టారు' అని తెలిపారు.