అక్టోబర్‌‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.87 లక్షల కోట్లు

72చూసినవారు
అక్టోబర్‌‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.87 లక్షల కోట్లు
దేశంలో వస్తు,సేవల పన్ను వసూళ్లు మరోసారి గణనీయ స్థాయిలో నమోదయ్యాయి. అక్టోబర్‌లో రూ.1.87 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్టీ రూపంలో రూ.33,821 కోట్లు, ఎస్‌జీస్టీ రూపంలో రూ.41,864 కోట్లు, ఐజీఎస్టీ రూపంలో రూ.99,111 కోట్లు సమకూరాయి. సెస్సుల రూపంలో మరో రూ.12,550 కోట్లు వచ్చాయి. గతేడాది అక్టోబర్‌లో వసూలైన రూ.1.72 లక్షల కోట్లతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 8.9 శాతం వృద్ధి నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్