మలేషియాలోనే అత్యంత ధనవంతుడుగా పేరున్న ఆనంద్ కృష్ణన్‌కు ఏకైక సంతానం 'వెన్ అజాన్ సిరిపన్నో'. తన తండ్రి ఆస్తి రూ.40 వేల కోట్లకు పైగానే ఉన్నా.. వెన్ అజాన్ ఆ ఆస్తిని త్యజించి బౌద్ధ సన్యాసిగా మారిపోయాడు. థాయ్‌లాండ్‌లో బుద్ధుని బోధనలు ప్రచారం చేస్తూ సామాన్య జీవితం గడుపుతున్నాడు. విదేశాల్లో చదువుకున్న అజాన్ 18 ఏండ్ల వయసు నుంచే ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేశాడు. కుమారుడి మార్గాన్ని తండ్రి కూడా గౌరవించాడు.