చాయ్ దుకాణం ముందు కేరళ గవర్నర్ బైఠాయింపు (వీడియో)

63చూసినవారు
కేరళలో అక్కడి ప్రభుత్వానికి, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకు ముదిరిపోతుంది. శనివారం ఎస్ఎఫ్ఐ ఆందోళనకారులు కొల్లామ్‌లో గవర్నర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. యూనివర్సిటీ ఛాన్సలర్ నియామకానికి గవర్నర్ అడ్డుకుంటున్నారని నల్లజెండాలతో నిరసన ప్రదర్శించారు. దాంతో ఆగ్రహంచిన గవర్నర్ కారు దిగి ఆందోళనకారుల వైపు దూసుకెళ్లారు. పోలీసులు అడ్డుపడటంతో వారి తీరును నిరసిస్తూ పక్కనే ఉన్న చాయ్ దుకాణం ముందు బైఠాయించారు.