కేరళను ముందే హెచ్చరించాం: అమిత్ షా

50చూసినవారు
కేరళను ముందే హెచ్చరించాం: అమిత్ షా
కేరళలోని వయనాడ్‌లో జరిగిన ఘోర విపత్తుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ప్రమాదం పొంచి ఉందని కేరళకు ముందే హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని జులై 23వ తేదీనే వార్నింగ్ ఇచ్చామన్నారు. అలాగే 26వ తేదీన కూడా ఈ విపత్తు కొనసాగే ఛాన్స్ ఉందని మరోసారి హెచ్చరించినట్టు చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్