తెలంగాణలో జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, మ.2 నుంచి 4.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులను గంటన్నర ముందే పరీక్ష కేంద్రంలో అనుమతిస్తారు. ఎగ్జామ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లను క్లోజ్ చేస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.