ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సీఆర్‌డీఏ) పరిధిని 8,352 చ.కి.మీ పెంచింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులిచ్చింది. పల్నాడు, బాపట్లలో విలీనం చేసిన ప్రాంతాలను సీఆర్‌డీఏలో కలిపింది. సత్తెనపల్లి పురపాలిక, పల్నాడు అర్బన్ అథారిటీలోని 92 గ్రామాలను సీఆర్‌డీఏలో విలీనం చేసింది. అలాగే బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలోని 562 చదరపు కిలోమీటర్లను కూడా విలీనం చేసింది.