రైతు భరోసాపై అధికారుల కీలక ప్రకటన

69చూసినవారు
రైతు భరోసాపై అధికారుల కీలక ప్రకటన
TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం ఎమ్మెల్సీ కోడ్ కారణంగా పలు జిల్లాల్లో నిలిచిపోయింది. ఈ మేరకు రైతు భరోసా సొమ్ము రైతుల ఖాతాలో జమ చేయడంలో ఆలస్యమవుతోంది. ఈ విషయమై లబ్దిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు మరోమారు స్పష్టం చేశాయి. కోడ్ ముగియగానే వారి ఖాతాల్లో రైతు భరోసా కింద తొలివిడత రూ.6000 జమ అవుతాయని స్పష్టం చేశాయి. మార్చి 31 వరకూ నిధుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పాయి.

సంబంధిత పోస్ట్