గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ముత్యాలమ్మ బోనాలు
చింతకాని మండలం నాగులవంచ గ్రామం శ్రావణమాస ముత్యాలమ్మ బోనాలు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో డీజే డప్పులతో మహిళలు అమ్మవారికి ఆదివారం బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు. గంగపుత్ర సంఘం పెద్దలు, పిల్లలు, మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.