భారత్‌లో ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోబోతున్న 15 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థుల్లో కేవలం 10% మందికి ఉద్యోగం లభిస్తుందని భావిస్తున్నామని టీమ్‌లీజ్ రిపోర్ట్ వెల్లడించింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో 60% మంది ఉద్యోగ అవకాశాలు కలిగి ఉన్నా, కేవలం 45% మందికి మాత్రమే ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాలు ఉన్నాయని పేర్కొంది. గ్రాడ్యుయేట్లలో నైపుణ్య లేమి ఉపాధి లభించకపోవడానికి ఒక కారణమని పేర్కొంది.