చింతకాని మండల పరిధిలో గల రైల్వే కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్మశానవాటిక నిర్మాణం గత సంవత్సర కాలంగా ముందుకు సాగడం లేదు. పైగా నాణ్యత లోపాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. అయిన కూడా పంచాయతీ అధికారులు కాని మండల అధికారులు కాని స్పందించి కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.