చింతకాని సరస్వతి పుత్రుడు.. నాలుగు ప్రభుత్వ కొలువులు
కృషి,పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీలేదని నిరూపించారు చింతకాని మండలం సీతంపేటకు చెందిన యువకుడు శానం ప్రసాద్. పాఠశాలల్లో విద్య,ఉద్యోగం కోసం రాసిన ప్రతి పోటీ పరీక్షలోనూ విజయం సాధించి శభాష్ అనిపించుకున్నాడు. తాజాగా ఉపాధ్యాయ కొలువు చేజిక్కుంచుకొని వరుసగా నాలుగో ఉద్యోగానికి ఎంపిక కావటం అభినందనీయం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను ఉద్యోగం సాధించాననీ.. గ్రూప్-2 అధికారి కావాలన్నదే తన లక్ష్యమని ప్రసాద్ తెలిపారు.