రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చింతకాని మండలం నాగులవంచలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన కంభం నాగేశ్వరరావు (48) మృతి చెందగా, వేముల శ్రీనివాసరావుకు తీవ్రగాయాలయ్యాయి. బైక్ మెకానిక్ నాగేశ్వరరావు, శ్రీనివాసరావు రాత్రి సమయాన ఖమ్మం-బోనకల్ ప్రధాన రహదారి వెంట వాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముష్టికుంటకు చెందిన బంధం నాగేశ్వరరావు బైక్ పై ఖమ్మం వైపు వెళ్తూ వీరిద్దరిని ఢీకొట్టాడు. ఘటనపై ఎస్ఐ నాగుల్ మీరా కేసు నమోదు చేశారు.