ఎర్రుపాలెం మండలంలో బుధవారం బీజేపి మండల అధ్యక్షుడు నూతక్కి నరసింహారావు ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు పాల్గోని మాట్లాడుతూ.. మండలంలోని రేమిడిచర్ల, ఎర్రుపాలెం, కొత్తపాలెం, వెంకటాపురం, సత్యనారాయణపురం, జమలాపురం, బంజర, భీమవరం, సక్కనవీడు, గుంటుపల్లి, గోపవరం గ్రామాలలో 2162 సాధారణ సభ్యత్వాలు నమోదనట్లు తెలిపారు.