Feb 05, 2025, 17:02 IST/సత్తుపల్లి
సత్తుపల్లి
సీఎం రేవంత్ రెడ్డికి సత్తపల్లి ఎమ్మెల్యే వినతి
Feb 05, 2025, 17:02 IST
హైదరాబాద్ లోని సీఎం ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డిని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కల్లూరు పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల, అగ్నిమాపక కేంద్రాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, నియోజవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు.