తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వేంసూర్ మండల 7వ మహాసభలు యు.పి.యస్.లచ్చన్నగూడెం పాఠశాల ఆవరణలో గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. యు. టి.యఫ్ అధ్యక్షుడు మేకల.ధర్మారావు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షలుగా యం. ధర్మారావు, ప్రధానకార్యదర్శిగా బి.ఈశ్వరాచారి,సహధ్యక్షులుగా ఎం.సుజాత, కె.శ్రీనివాసరెడ్డి, కోశాధికారిగా యస్.డి.యాకుబ్ ఆలీ,కార్యదర్శులుగా కె.నిర్మల కుమారి,జడ్.భాస్కరరావు, పి.దీన్ దయాళ్, టి.రామ శేషు మరియు ఆడిటర్ గా యన్.మారేశ్వరరావు లను మండల కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఖమ్మం జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు కొక్కెరగడ్డ.వెంకటేశ్వరరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరి.వీరబాబు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి జె.మురళీమోహన్, ఖమ్మం జిల్లా కార్యదర్శి జి.యస్.ఆర్.రమేష్ మరియు సీనియర్ సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.