జెడ్పీ జిపియఫ్ స్లిప్పులు విడుదల చేయాలి

175చూసినవారు
జెడ్పీ జిపియఫ్ స్లిప్పులు విడుదల చేయాలి
జెడ్పీ జిపియఫ్ విభాగంలో నెలకొని ఉన్న అనేక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టియస్ యుటియఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జడ్పీ ఎ.ఒ మరియు డిప్యూటీ సిఇఓ వింజం.అప్పారావు గారికి శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కార్యాలయంలో ప్రాతినిధ్యం చేయనైనది. ఈ సందర్భంగా ఆనేక సమస్యలను జిల్లా కమిటీ డిప్యూటీ సిఇఓ దృష్టికి తీసుకురావడం జరిగింది. నూతన జిల్లాలు (ఖమ్మం - భద్రాద్రి)ఏర్పడినందున జిల్లాల వారీగా జిపియఫ్ ఖాతాలను బదిలీ చేయాలని, 2019-20 సంవత్సరానికి సంబంధించిన స్లిప్పులు విడుదల చేయాలని, ఋణాల మంజూరీలో జాప్యాన్ని నివారించాలని, మిస్సింగ్ క్రెడిట్స్ సరిచేయాలని , జిపియఫ్ వెబ్సైట్ పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సిఇఓ గారితో చర్చించనైనది. నాలుగైదు రోజులలో జెడ్పీ జిపియఫ్ వెబ్సైట్ పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని, స్పెషల్ డ్రైవ్ చేపట్టి సమస్యలన్నింటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని డిప్యూటీ సిఇఓ గారు ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రాతినిధ్యం చేసిన వారిలో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.వి.నాగమల్లేశ్వరరావు, నెల్లూరి. వీరబాబు, బుర్రి.వెంకన్న, పారుపల్లి. నాగేశ్వరరావు తదితరులున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్