ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు నాలుగు రోజులు సెలవు

61చూసినవారు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు నాలుగు రోజులు సెలవు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు నాలుగు రోజుల సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 14, 15 తేదీల్లో వారంతపు సెలవులు కాగా, 16న వినాయక నిమజ్జనం, 17న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా వరుసగా 4 రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తిరిగి ఈనెల 18న బుధవారం నుంచి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్