దేశానికి దిశా నిర్దేశం చేసే అనేక చట్టాల రూపకల్పనలో కమ్యూనిస్టులు కీలకంగా వ్యవహరించారని, వాటిలో సీతారాం ఏచూరి పాత్ర ఎనలేనిదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. మార్క్సిజం విలువల కోసం పని చేసిన మహోన్నత వ్యక్తి ఏచూరి అని కొనియాడారు. సీపీఎం నాయకులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన ఖమ్మం సుందరయ్య భవనంలో శుక్రవారం ఏచూరి సంతాప సభ నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.