ప్రజలు మొక్కలు నాటడంతోపాటు, స్వచ్ఛత వైపు ఆడుగులు వేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పిలుపునిచ్చారు. స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ది అధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం బతుకమ్మ, ముగ్గుల పోటీలు నిర్వహించారు. వివిధ మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాలు మహిళలు సుమారు 200 మంది పాల్గొన్నారు.