ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో గల అర్హులైన లబ్ధిదారులకు శాసనసభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సిఫార్సు మేరకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిషోర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.