ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు ప్రాంతాలలో గురువారం దసరా ఉత్సవాలలో భాగంగా దేవి శరన్న నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక నిర్వాహకులు అమ్మవారిని మొదటి రోజు బాలాత్రిపుర సుందరి అలంకారంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలలో స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.