మధిర మండలంలో వైరా నదిపై నిర్మించిన జాలిముడి ప్రాజెక్టు ఎడమ కాల్వ సైడ్ వాల్ సోమవారం రాత్రి తెగిపోయింది. ఇటీవల వచ్చిన భారీ వర్షాలతో కాల్వ సైడ్ వాల్ కొంతమేర ధ్వంసమైంది. కాగా, ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వకు నీటి ఉధృతి పెరగడంతో ఇప్పుడు సైడ్ వాల్ తెగిపోయిందని రైతులు తెలిపారు. ఈ కాల్వ ద్వారా పలు గ్రామాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఈ మేరకు అధికారులు స్పందించి సైడ్ వాల్ నిర్మించాలని రైతులు కోరుతున్నారు.