మధిర పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో నిర్వహిస్తున్న దేవి శరన్న నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం అమ్మవారు ప్రత్యాంగిరా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శేషాచార్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.