ఖమ్మం జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కొనసాగుతుంది. జిల్లాలో 5, 66, 403 కుటుంబాలను గుర్తించగా అందులో 1, 51, 923 కుటుంబాల సర్వే పూర్తి చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 26. 82శాతం మేర సర్వే గురువారం నాటికి పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. సింగరేణి మండలంలో సర్వే 47. 47శాతంతో సర్వే వేగవంతంగా సాగుతుండగా ఖమ్మం అర్బన్ మండలంలో 7. 53శాతం తో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మందకోడిగా సాగుతుంది.