వెంకటగిరిలో ఉన్న ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలి

57చూసినవారు
వెంకటగిరిలో ఉన్న ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలి
ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామపంచాయతీలోని నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రామంలో ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ డిమాండ్ చేశారు. వెంకటగిరి గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ మహాసభ గురువారం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇస్తానన్న ఇంటి స్థలాలను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామశాఖ నూతన కమిటీని ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్