సాగర్ రెండో జోన్ ఆయకట్టుకు నీటి సరఫరా పెంపు

58చూసినవారు
సాగర్ రెండో జోన్ పరిధిలో ఖమ్మం జిల్లా ఆయకట్టుకు శుక్రవారం అధికారులు నీటి విడుదలను 3వేల క్యూసెక్కులకు పెంచారు. పాలేరు ఎడమ కాల్వ మరమ్మతులు పూర్తయిన తర్వాత ఇరిగేషన్ అధికారులు ఖమ్మం జిల్లా ఆయకట్టుకు క్రమంగా నీటి ప్రవాహాన్ని పెంచుతున్నారు. పాలేరు జలాశయం నీటి మట్టం ప్రస్తుతం 18. 75 అడుగులు ఉంది. క్యాచ్ మెంట్ నుంచి 2905 క్యూసెక్కులు, మొదటి జోన్ నుంచి 1068 క్యూసెక్కుల నీరు పాలేరు జలాశయానికి చేరుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్