కార్తీక పౌర్ణమి శివకేశవులకు ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు దీపం వెలిగిస్తే సర్వపాపాలు హరించడమే కాక అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మిక. ఈమేరకు శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు చేరుకుని పూజలు చేసి దీపాలు వెలిగించనున్నారు. ఈసందర్భంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శివుడి ఆలయాలను విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. అంతేకాక పలువురు నదీస్నానానికి ఏర్పాట్లు చేసుకున్నారు.