సిపియస్ పెన్షన కు వ్యతిరేకంగా ఉపాధ్యాయ ఐక్యవేదిక నిరసన

287చూసినవారు
సిపియస్ పెన్షన కు వ్యతిరేకంగా ఉపాధ్యాయ ఐక్యవేదిక నిరసన
సి.పి.యస్ పెన్షన్ కు వ్యతిరేకంగా మంగళవారం మధ్యాహ్నం వేంసూరు మండల టి.యస్.యు.టి.యఫ్, టి.పి.టి.యఫ్ వేంసూరు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. అనంతరం మండల రెవెన్యూశాఖ అధికారి లక్ష్మణ్ (ఆర్ ఐ) కి మెమోరాండం అందచేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సిపియస్ రద్దు చేసి అందరికీ పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఐక్య వేదిక సంఘాల నాయకులు మేకల ధర్మారావు, జి యస్ ఆర్ రమేష్, శ్రీనివాసరెడ్డి, సుజాత, నిర్మల కుమారి, మారేశ్వరరావు, భాస్కరరావు, చంద్రశేఖర్, ఈశ్వరాచారి, యాకుబ్ ఆలీ,నాగేంద్రరావు సిపియస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్