పెనుబల్లి లాబ్ టెక్నీషియన్ తొలగింపు

62చూసినవారు
పెనుబల్లి లాబ్ టెక్నీషియన్ తొలగింపు
పెనుబల్లి ఏరియా ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ ప్రతిభను విధుల నుండి తొలగిస్తూ డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతనెల 27న ఆస్పత్రిని అదనపు కలెక్టర్ శ్రీజ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్ పేషంట్లకు రక్తపరీక్ష చేయాల్సి వస్తే ప్రైవేట్ ల్యాబ్ కు పంపిస్తున్నారని పలువురు ఆమెకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టగా, ల్యాబ్ టెక్నీషియన్ పై చర్యలకు సిఫారసు చేశారు.

సంబంధిత పోస్ట్