సింగరేణి: ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
సింగరేణి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా టౌన్ ప్రెసిడెంట్ పోలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మంజుల, మేదరి టోనీ, సురేందర్, శంషుద్దీన్, రాములు, షఫీ, మజీద్ పాషా తదితరులు పాల్గొన్నారు.