పంచాయతీ కార్యదర్శుల మండల నూతన సంఘం ఎన్నిక
సింగరేణి మండలం పంచాయతీ కార్యదర్శుల మండల నూతన కమిటీని శుక్రవారం ఎంపీఓ రవిచంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నెహ్రూ, ఉపాధ్యక్షులుగా మద్దెల వెంకటేష్, జనరల్ సెక్రటరీగా హరి, కోశాధికారిగా కొత్తపల్లి అనూష, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పెండ్ర అనిల్ కుమార్, గౌరవ సలహాదారులుగా కొండపల్లి అనిల్, రామకృష్ణ లను ఎన్నుకున్నారు.