సింగరేణి మండలం గాంధీనగర్ గ్రామములో జనావాసాల మధ్య ఉన్న రహదారి పూర్తిగా పిచ్చి మొక్కలతో అడవిని తలపించే విధంగా ఉన్నది. ఈ రహదారి గుండా గాంధీనగర్ ప్రజలు నిత్యం అవసరాల నిమిత్తం భయంతో తిరుగుతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు దీనిపై దృష్టి సారించి ఈ రహదారి పై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని పలువురు గాంధీనగర్ ప్రజలు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు.